నేటితో ముగియనున్న సీపీగెట్ దరఖాస్తుల గడువు
తెలంగాణలోని 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సీపీగెట్ దరఖాస్తులకు ఆదివారంతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు సీపీగెట్‌కు 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసినా రూ.500 ఫైన్‌తో ఈనెల 18, రూ.2 వేల ఫైన్‌తో ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశముంది.