ChotaNews Quick Feeds

‘అలాంటి వార్తలపై వ్యాఖ్యానించలేం’

‘అలాంటి వార్తలపై వ్యాఖ్యానించలేం’

అమెరికా అద్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని, అందుకు మోదీ అంగీకరించారని వస్తున్న వార్తలపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఇటువంటి మీడియా రిపోర్ట్‌లపై, వార్తలపై తాము వ్యాఖ్యానించలేమని చెప్పారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు తాము అధికారికంగా హైలెవెల్ పర్యటనను ప్రకటిస్తామని తెలిపారు.

‘జాబ్ క్యాలెండర్​ ఏది జగన్ గారు’

‘జాబ్ క్యాలెండర్​ ఏది జగన్ గారు’

చిన్న మధ్య తరగతి పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త కంపెనీ అయినా వచ్చిందా? ఒక్క సారైనా జాబ్​ క్యాలెండర్ విడుదల చేశారా? అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర నేటికి 7వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేష్​ను న్యాయవాదులు కలిశారు.

భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ వీక్షించనున్న మోదీ

భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ వీక్షించనున్న మోదీ

భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం.