ChotaNews Quick Feeds

40 పేజీల శుభలేఖ.. అన్నింటికి క్యూఆర్‌ కోడ్..

40 పేజీల శుభలేఖ.. అన్నింటికి క్యూఆర్‌ కోడ్..

AP: రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్‌(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. వారి వివాహానికి సంబంధించి వారి వివాహ వేడుకకు సంబంధించి నిశ్చితార్థం మొదలుకొని.. 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలను వివరిస్తూ 40 పేజీల శుఖలేఖను సిద్ధం చేశారు. ప్రతి ఘట్టానికి ఆన్‌లైన్‌లో చూసేందుకు వీలుగా ఒక క్యూఆర్‌ కోడ్‌ రూపొందించారు.

రేపు TSRJC ప్రవేశ పరీక్ష

రేపు TSRJC ప్రవేశ పరీక్ష

TG : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ప్రవేశాలకు ఆదివారం TSRJC పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షకు ఈ సారి 73,527 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు వివరించారు.

నీట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -2024 ఎప్పుడంటే ?

నీట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -2024 ఎప్పుడంటే ?

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2024 పరీక్ష నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది మే 6, పరీక్ష తేదీ జూన్‌23, మరిన్ని వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.