ChotaNews Quick Feeds

ఎంపీ వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ

ఎంపీ వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ

ఈ ఎన్నికల్లో బీజేపీ టికెటు దక్కని వరుణ్ గాంధీ ఫీలీభీత్ నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. ‘1983లో మూడేళ్ల వయసులో మా అమ్మ వేలు పట్టుకొని ఈ ప్రాంతంలో అడుగుపెట్టా. ఈ ప్రజలంతా నా కుటుంబమే. ఎంపీగా నాపదవీకాలం ముగిసినా.. మీతో నాబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. మీకోసం మాఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని వరుణ్ లేఖలో పేర్కొన్నారు.

నేను మాట్లాడాల‌నుకుంటున్నా: కేజ్రీవాల్‌

నేను మాట్లాడాల‌నుకుంటున్నా: కేజ్రీవాల్‌

కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసు గురించి మాట్లాడాల‌నుకుంటున్నాన‌ని కేజ్రీవాల్ న్యాయ‌మూర్తిని అభ్య‌ర్థించారు. లిఖితపూర్వ‌కంగా ఇవ్వాల‌ని న్యాయ‌మూర్తి కేజ్రీవాల్‌ను కోరారు. ద‌య‌చేసి మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌టంతో కోర్టు అంగీక‌రించింది. త‌న వాద‌న వినిపిస్తుండ‌గా ఈడీ త‌ర‌పు న్యాయ‌మూర్తి అడ్డుపడ‌టంతో 5 నిమిషాలు కేటాయించాలని వేడుకున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి, కవితల గురించి కేజ్రీవాల్ మాట్లాడారు.

బీజేపీ నేత బండి సంజయ్‌పై కేసు నమోదు

బీజేపీ నేత బండి సంజయ్‌పై కేసు నమోదు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్‌లో బీజేపీ నేత బండి సంజయ్‌పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్‌పై కేసు న‌మోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని సీఐ ఫిర్యాదు చేయటంతో మేడిప‌ల్లి పోలీసులు బండి సంజ‌య్‌పై కేసు ఫైల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో పాటు మరొకొందరిపై కూడా కేసు న‌మోదైంది.