ChotaNews Quick Feeds

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక (శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.

వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: తుమ్మల

వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: తుమ్మల

TG: వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. 2023-24యాసంగికి సంబంధించి ఈరోజు వరకు 64,75,819మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసిన‌ట్లు తెలిపారు. ఇప్పటికే 92.68శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేశామ‌ని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులు 3నెలల కంటే తక్కువ రోజులలోనే జమ చేయడం జరగలేదని గుర్తుచేశారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

ఈనెల 31వ తేదీతో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాటిలో SBI డెబిట్ కార్డుల చార్జెస్ పెరగనున్నాయి. అలాగే గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫాస్టాగ్ KYCల్లో మార్పులు రానున్నాయి. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే 1వ తేదీ నుంచి పని చేయవు. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు రానున్నాయి.