ChotaNews Quick Feeds

SRH విధ్వంసం.. హెడ్ రికార్డ్

SRH విధ్వంసం.. హెడ్ రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH బ్యాట్స్‌మెన్ మరోసారి హెడ్ చెలరేగాడు. కేవలం 16 బంతుల్లోనే 54 పరుగులు సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మతో సమంగా నిలిచాడు. మరోవైపు హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారుతోంది.

ఆ ఐదు నిమిషాలు క్యూలో నిల్చోండి: సీజేఐ

ఆ ఐదు నిమిషాలు క్యూలో నిల్చోండి: సీజేఐ

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డి.వై.చంద్రచూడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు ఎన్నో హక్కులు ఇచ్చిందని, అలాగే పౌరులు కూడా తమ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. ‘‘ఐదేళ్లకోసారి ఐదు నిమిషాలైనా లైన్లో నిలబడి ఓటు వేయాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలతో ప్రజల వల్ల నడిచేది. మన ఓటే మన గళం’’ అని సీజేఐ పేర్కొన్నారు.

ఒడిశా, బెంగాల్ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్

ఒడిశా, బెంగాల్ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్

ఒడిశా, వెస్ట్ బెంగాల్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఒడిశాలో మూడు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్‌లో ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది.