ChotaNews Quick Feeds

రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి

రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి

TG: అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పంట పొలాలు సందర్శించని బీఆర్ఎస్‌ నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నాం అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

రాణించిన కోహ్లీ.. RCB స్కోర్ 182/6

రాణించిన కోహ్లీ.. RCB స్కోర్ 182/6

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB గౌరవప్రదమైన స్కోర్ చేసింది. బెంగళూరులో విరాట్ కోహ్లీ(83), గ్రీన్(33), మ్యాక్స్‌వెల్(28) రాణించారు. దీంతో RCB నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోల్‌కతాలో హర్షిత్ రానా 2, రస్సెల్ 2 వికెట్లు తీసుకోగా.. నరైన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలవాలంటే 20 ఓవర్లలో 183 పరుగులు చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 6న కాంగ్రెస్ మేనిఫెస్టో: భట్టి

ఏప్రిల్ 6న కాంగ్రెస్ మేనిఫెస్టో: భట్టి

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఉంటుందని, అదేరోజున మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పీఈసీ మీటింగ్‌లో వంద రోజుల పాలనపై చర్చించామని.. తెలంగాణను ఒక మోడల్‌గా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ మాట్లాడటం సరికాదని.. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.