ChotaNews Quick Feeds

అఫ్ఘాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదా రద్దు

అఫ్ఘాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదా రద్దు

అఫ్ఘనిస్తాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదాను అమెరికా రద్దు చేసింది. తాలిబన్లు అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న ఏడాది తర్వాత అమెరిగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

దూకుడు పెంచిన భారత బ్యాటర్లు

దూకుడు పెంచిన భారత బ్యాటర్లు

కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత బ్యాటర్లు దూకుడు పెంచారు.10 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (35), సూర్యకుమార్ యాదవ్ (31) పరుగులతో ఉన్నారు.

బొత్స వ్యాఖ్యలపై  అమరావతి జేఏసీ ఫైర్

బొత్స వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ ఫైర్

AP: కన్నెర్ర జేస్తే 5 నిమిషాల్లో యాత్రలు ఆగిపోతాయని, చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ నేతలు మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. జగన్ సర్కార్‌కి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

SBI కస్టమర్లకు అలర్ట్!

SBI కస్టమర్లకు అలర్ట్!

కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్ ద్వారా అందించే సేవలపై అలర్ట్ జారీ చేసింది. ఎస్బీఐ యోనో యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. భద్రతతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలు పొందాలంటే వెంటనే ఆండ్రాయిడ్ ఓఎస్ 9, ఆ పై వర్షన్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.