ChotaNews Quick Feeds

జగన్‌ పేరు విని పారిపోతున్న కంపెనీలు: లోకేశ్

జగన్‌ పేరు విని పారిపోతున్న కంపెనీలు: లోకేశ్

AP: టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పలమనేరు క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్ పాల్గొన్నారు. సీఎం జగన్‌ను చూసి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో ఒక్క కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. టమోటా, పట్టు రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని హామీ ఇచ్చారు.

నెల్లూరు రూరల్ YCP ఇంచార్జి ప్రకటన

నెల్లూరు రూరల్ YCP ఇంచార్జి ప్రకటన

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంచార్జిని ప్రకటించింది. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ అధిష్టానంపై దిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు.

ఇది నా అదృష్టం: కిరణ్ అబ్బవరం

ఇది నా అదృష్టం: కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన తాజాచిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ..‘కథ వినగానే బాగా నచ్చేసింది. గీతా ఆర్ట్స్ 2లో ఇంత త్వరగా చేసే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.